TG: పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇప్పుడు తమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర 2 వేల ఎకరాల భూమిని ఇవ్వలేదా? అని రేవంత్ ప్రశ్నించారు. తమ్మిడిహెట్టిపై ఉన్న సమస్యలను పరిష్కరించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. తమకు రాజకీయ పంచాయతీలకన్నా, సమస్య పరిష్కారమే ముఖ్యమని సీఎం తెలిపారు.