KNR: శంకరపట్నం మండల నూతన ఎంపీడీవోగా పనసా అనిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన గోల్కొండ కృష్ణ ప్రసాద్ ములుగు జిల్లాకు బదిలీ కాగా, కరీంనగర్ నుంచి బదిలీపై వచ్చిన ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీవో ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఆమెకు స్వాగతం పలికారు.