NZB: ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాతల్ల సునీత (28) వరి చేనులో కూలి పనులకు వెళ్లింది. ఈ క్రమంలో సునీత పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిది.