కోనసీమ: ఆలమూరు మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో నర్సిపూడిలో రూ.3 కోట్ల వ్యయంతో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. గోదావరి పుష్కరాలు ఫేస్-1లో భాగంగా నిర్మాణం చేపట్టనుండగా, స్థల సేకరణ పూర్తైంది. ఈ సబ్ స్టేషన్ ద్వారా మోదుకూరు, గుమ్మిలేరు, నర్సిపూడి ప్రాంతాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది.