ASF: BRS పదేళ్ల పాలనలో ఒరిగింది ఏమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కాగజ్ నగర్లో మంత్రి మాట్లాడుతూ.. BRS పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలకే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చాయని, మారుమూల గిరిజన ప్రాంతాలను విస్మరించిన ఘనత BRS ప్రభుత్వానిదేనన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.