PLD: ఉప్పరపాలెం శివారులో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఎడ్లపాడు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలపాలని ఆయన హెచ్చరించారు.