SDPT: జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం కల్పిస్తూ జూన్ 1 నుంచి 12 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ కే. హైమావతి, అటవీశాఖ అధికారి పద్మజారాణి ఆవిష్కరించారు. ప్రకృతి సంపద, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.