TG: రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే యూరియాను రాష్ట్రానికి ముందుగా కేటాయించాలని కోరామన్నారు.