ASR: జీ.మాడుగుల మండలం చిన్నవానిపాలెంకు చెందిన డాక్టర్ కూడా లక్ష్మి సోమవారం జాయింట్ కలెక్టర్ శ్రీపూజను మర్యాదపూర్వకంగా కలిశారు. అరకు కాఫీపై చేసిన అధ్యయనానికి గాను కూడా లక్ష్మికి ఇటీవల విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా స్వీకరించారు. ఈక్రమంలో డాక్టరేట్ పబ్లికేషన్ అనే పుస్తకాన్ని జేసీ ఆవిష్కరించారు. డాక్టరేట్ పొందిన లక్ష్మిని జేసీ అభినందించారు.