VSP: విశాఖలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో జీవీఎంసీకి మొత్తం 120 ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి 54, ఇంజినీరింగ్‌కు 23, యూసీడీకి 25 వినతులు వచ్చాయి. ప్రజల అర్జీలపై వెంటనే స్పందించి, నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.