TG: ఆనాటి పాలకులు తమ్మిడిహెట్టిని పడావు పెట్టారని, కానీ తాము ఇక్కడ కచ్చితంగా బ్యారేజీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో చర్చలకు ప్రయత్నిస్తున్నామని, కానీ ఆయన ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆదిలాబాద్ ఉప్పెనలా ఎగిసిపడుతుందని, ఆదిలాబాద్ కదిలితే మహారాష్ట్రకే నష్టమని CM హెచ్చరించారు.