సత్యసాయి: కదిరి ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ‘వాయిస్ ఆఫ్ సిటిజన్’ కార్యక్రమాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలు 04048210053 నంబరు ద్వారా లేదా ఏఐ తెలుగు వాయిస్ బాట్ 04045210910 నంబరుకు కాల్ చేసి తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చు.