VZM: జిల్లాలో జనగణన ప్రక్రియ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. ఈ మేరకు దీనిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. 19 మండలాల్లోని 468 గ్రామాల్లో జనాభా నమోదు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, 2011 జనగణన వివరాలతో సరిపోల్చి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.