టాలీవుడ్, కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ చిక్కింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్, కాయదు లోహర్ నటిస్తున్న ‘మంజనాథి’ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమవడం తనకెంతో గౌరవంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.