AKP: జిల్లాలో తొలిరోజైన సోమవారం 90.38శాతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశామని కలెక్టర్ నిశాంతి తెలిపారు. జిల్లాలో 11మండలాల్లో 73,549 మంది పెన్షన్ లబ్దిదారులకు గాను రూ.31,13,98,000 సొమ్ము మంజూరు కాగా, సోమవారం సాయంత్రం నాటికి 66,472 మందికి రూ.28,08,94,500 (90.2శాతం) సొమ్మును పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారికి మంగళవారం పంపిణీ చేస్తామన్నారు.