సంగారెడ్డిలోని పోలీస్ పరిధి మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సోమవారం పరిశీలించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మంత్రి దామోదర రాజనర్సింహ హాజరవుతున్నందున బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.