AP: విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. జోన్ అధికారులతో GM సందీప్ మాథుర్ సమీక్ష నిర్వహించారు. సౌత్ కోస్ట్ రైల్వే సిస్టం మ్యాప్‌ను ఆవిష్కరించారు. కొత్త జోన్లో విలీనమవుతున్న డివిజన్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆస్తులు, మానవ వనరుల నిర్వహణ, సవాళ్ల గురించి చర్చించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జీఎం సందీప్ మాథుర్ అధికారులకు సూచించారు.