KRNL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజల నుంచి 132 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఈ మేరకు ఎస్పీ విక్రాంత్ ఆదేశించారు.