TG: గచ్చిబౌలి సభకు అనుమతి నిరాకరణపై జనసేన స్పందించింది. పార్కింగ్ సమస్యను సాకుగా చూపి నిరాకరించడం సరికాదని పేర్కొంది. సంధ్య కన్వెన్షన్లో గతంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయని.. అప్పుడు రాని పార్కింగ్ సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అర్థరహితమని మండిపడింది.