TG: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులు, అధికారులకు ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. టీఎస్ జెన్కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్ ప్రతాప్‌కు సీఎం సర్వోన్నత పోలీసు పతకం, ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ సంపత్, మరో ఏడుగురికి శౌర్య పతకాలు వరించాయి. 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మందికి ఉత్తమ సేవా పతకాలను అందుకోనున్నారు.