‘విత్ లవ్’ హిట్‌తో మెప్పించిన అభిషన్ జీవింత్ హీరోగా తన రెండో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. గౌతమ్ శివరామ్ దర్శకత్వంలో డ్రామా కంపెనీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కబోయే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శివానీ నాగరం, యోగలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.