VKB: కుల్కచర్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టీ.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అభివృద్ధి పనులు, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆయన స్థానికులతో చర్చించారు.