TG: తాము కొనుగోలు చేసిన అన్ని పంటలను కేంద్రం సేకరించాలని CM రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటున్నామని, అలాగే 40 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న పండిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొనే ఈ పంటను కేంద్రం తీసుకునేలా కిషన్ రెడ్డి బాధ్యత వహించాలని సీఎం అన్నారు. పంటను కేంద్రం తీసుకోకపోతే, జూన్ 15 తర్వాత బీజేపీ ఆఫీసు దగ్గరే తేల్చుకుంటామని హెచ్చరించారు.