BPT: స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో సోమవారం మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శాలిని, డాక్టర్ హస్మప్రియ సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు.