NRML: రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఘాట్లు, రహదారులు, త్రాగునీటి సదుపాయాలు, లైటింగ్ తదితర నిర్మాణ, మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సూచించారు.