AP: కలియుగ వైకుంఠం తిరుమలకు ‘మే’ నెలలో భక్తులు భారీగా పోటెత్తారు. గత నెలలో ఏకంగా 25 లక్షల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ‘మే’ నెలలో శ్రీవారి హుండీకి రూ.120.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో 23.23 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటే.. ఈ ఏడాది ‘మే’లో అదనంగా మరో 2 లక్షల మంది తిరుమలకు వచ్చారు.