VSP: విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే (ఎస్సీఓఆర్) జోన్ సోమవారం నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సిస్టమ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. కొత్త జోన్‌తో రైల్వే సేవలు, పరిపాలనా సామర్థ్యం మరింత మెరుగుపడతాయని ఆయన తెలిపారు. అనంతరం నిర్వహించిన భద్రతా సమీక్ష సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.