RR: బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్పూర్ బంధంకొమ్ము వరకు రూపుదిద్దుకుంటున్న ఫ్లైఓవర్, 4 లైన్ల రహదారి పనులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పరిశీలించారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావుల చొరవతో, జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఈ ఎన్నో ఏళ్ల కల సాకారమవుతోందని వారు తెలిపారు.