TG: తాను చేపట్టే ఏ కార్యక్రమమైనా ఆదిలాబాద్ గడ్డ మీద నుంచే ప్రారంభిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా నిర్మల్‌లోనే తన మొదటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టానని గుర్తుచేశారు. అలాగే, ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ‘గిరిజన దండోరా’ సభ నిర్వహించినట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు.