VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ 42 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను 7 రోజుల్లో పరిష్కరించి నివేదిక సమర్పించాలని సూచించారు.