TG: రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే, ఆదివాసీల కోసం అదనంగా మరో 21 వేల ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే తల తాకట్టు పెట్టి అయినా సరే ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో మరో లక్ష ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు జరుగుతాయన్నారు.