MNCL: సాధారణ పౌరులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల జోన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. జూన్ 1 నుంచి జూలై 1 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, పరిస్థితులను బట్టి గడువు పొడిగిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.