AP: ప్రస్తుతం బీపీ, షుగర్ కేసులు బాగా పెరిగిపోతున్నాయని.. అందుకే ఆధునిక జీవన విధానంలో యోగా చాలా అవసరమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 2020-25 వరకు మెంటల్ హెల్త్ విషయంలో సగటున 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ పరిస్థితి నుంచి బయటపడటానిక యోగా ఒక్కటే మార్గమన్నారు. వేసవి తర్వాత విద్యార్థుల్లో యోగాపై అవగాహన కల్పిస్తామని, JUN-20 వరకు వివిధ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.