VZM: గుర్ల మండలం గుజ్జంగివలస ఓం శక్తి గోశాల నిర్వహణ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న అట్టాడ రామకృష్ణపై విచారణ చేపట్టి, పశువుల అక్రమరవాణాకు పాల్పడినట్లుగా గుర్తించి, గుర్ల పోలీసు స్టేషనులో పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రామకృష్ణపై కొన్ని ఆరోపణలు రావడంతో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులను విచారణ చేపట్టాలని ఆదేశించామని ఎస్పీ చెప్పారు.