TG: సీతమ్మసాగర్ అనుమతులు NGTలో పెండింగ్లో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. త్వరగా భూసేకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి పలు నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేస్తామని చెప్పారు. అలాగే మారెళ్లపాడు ఎత్తిపోతల ద్వారా 16 వేల ఎకరాలకు నీరు అందుతాయని.. ఈ ప్రాజెక్ట్ పనులు జూలై చివరి నాటికి పూర్తి అవుతాయన్నారు.