‘ధురంధర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సారా అర్జున్, ఇప్పుడు దిగ్గజ నటి మధుబాల బయోపిక్‌లో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మీత్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాత్ర కోసం పలువురు అగ్ర నాయికల పేర్లు పరిశీలించినా, చివరికి సారానే ఎంపిక చేసినట్లు బాలీవుడ్ టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.