VZM: కొత్తవలస మండలం సంతపాలెం గ్రామస్థులు గత నెల 25న, ఏపీ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. ఈ మేరకు రాష్ట ఛైర్మన్ ఆదేశాల మేరకు ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఇవాళ సందర్శించారు. గత 40 ఏళ్ల నుంచి తమ అధీనంలో ఉన్న 48 ఎకరాల భూములను వేరే పేర్లతో నమోదు అయ్యినట్లు చెప్పారు, అందులో జాతీయ రహదారిలో అయిదు ఎకరాల భూములు కోల్పోయినట్లు తెలిపారు.