TG: అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉందా? ప్రాంతీయ వాదమే.. కాంగ్రెస్ వాదమా? అని పవన్ ప్రశ్నించారు.’ప్రాంతీయ వాదం గురించి జాతీయ పార్టీ మాట్లాడవచ్చా? ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్ పోర్టు తీసుకొని వెళ్లాలా? ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తే దేశ సుస్థిరత దెబ్బతింటుంది. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరం. ప్రాంతీయవాదం బలపడితే జనగణమన, వందేమాతరం కూడా పాడరు’ అని పవన్ అన్నారు.