WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పతకాలు అందుకున్న పోలీస్ అధికారులను కమిషనర్ సన ప్రీత్ సింగ్ మంగళవారం అభినందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవాపతకం, సేవాపతకాలు అందుకున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు ప్రభుత్వ గుర్తింపు లభించడం గర్వకారణం అన్నారు.