GNTR: గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టు పనులు, పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు.