AKP: కోటవురట్ల, కొత్తురు గ్రామాల్లో అక్రమ కొళాయి కనెక్షన్లు తొలగించాలని ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. రెండు గ్రామాల్లో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన రెండు గ్రామాల్లో పర్యటించి పరిస్థితి పరిశీలించారు. చాలామంది అక్రమ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడంతో తాగునీటి కొరత ఏర్పడిందన్నారు.