SRD: సిర్గాపూర్ మండలం వాసర్ రైతుల సహకారంతో ఎనిమిదేళ్లు ఎలాంటి రిమార్క్ లేకుండా విధులు నిర్వహించానని ఏఈవో శ్వేత అన్నారు. వాసర్ క్లస్టర్ నుంచి కంగ్టికి ఆమె బదిలీ అయ్యారు. మంగళవారం వాసర్లో సర్పంచ్ హనుమంతు, రైతులు ఏఈవోకు సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె మాట్లాడుతూ.. ఇక్కడి రైతులు ఎంతో ఆప్యాయతతో ఆదరించి, విధుల నిర్వహణకు సహకరించారన్నారు.