KNR: సైదాపూర్ మండలం సోమారం మోడల్ స్కూల్ విద్యార్థులు ఆవుల లిఖిత్, కే. శృతి ప్రతిభతో బాసర ఐఐఐటీలో సీట్లు దక్కించుకున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వీరిని పాఠశాల ప్రిన్సిపల్ బీ. సంపత్ కుమార్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారని పేర్కొన్నారు.