టాలీవుడ్లో దర్శకుడు గుణశేఖర్, మహేష్ బాబుల కాంబోలో వచ్చిన ‘ఒక్కడు’ సంచలన విజయం సాధించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ ‘ఒక్కడు’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒక్కడు కథను మహేష్ బాబును మనసులో పెట్టుకుని రాసి ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యేది’ అని ఆయన అన్నాడు. ‘సైనికుడు’ పరాజయం నేపథ్యంలో గుణశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.