TG: ఆంధ్రలోనే అధికారం కోరుకోని వాడిని.. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుకుంటానని పవన్ ప్రశ్నించారు. తాను తెలంగాణలో అధికారం కోరుకోవడం లేదని, మార్పు మాత్రమే కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని.. విభజించిన తీరుకే వ్యతిరేకమన్నారు. తనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని కొందరు హెచ్చరిస్తున్నారని.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? అని పవన్ ప్రశ్నించారు.