రెండో రోజు జరిగిన జేఈఈ మెయిన్ షిఫ్ట్-1 పరీక్షలో గణితం, ఫిజిక్స్ నుంచి అడిగిన ప్రశ్నలు సులువుగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కెమిస్ట్రీలో థర్మో కెమిస్ట్రీ తదితర విభాగాల నుంచి అడిగిన ప్రశ్నలు కాస్త సమయం తీసుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. షిఫ్ట్-2లో కెమిస్ట్రీలో.. ప్రధానంగా ఇనార్గానిక్ విభాగాల్లో ప్రశ్నలు జ్ఞాపకశక్తి ఆధారితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.