బాపట్ల: అద్దంకి ప్రధాన బజార్లోని ఫ్యాషన్ షోరూంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి టేబుల్ డ్రాయర్లో ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఘటన జరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.