HNK: హనుమకొండ ఏకశిలా పార్కులో మహనీయుల జయంతి ఉత్సవాల నేపథ్యంలో సామాజిక పరివర్తన ప్రచార ఉద్యమాన్ని నిర్వహించారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోనీ సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి సూత్రాలను ప్రచారం చేసి రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డీబీఎఫ్ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.