‘అఖండ’ విజయం తర్వాత బాలయ్య మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూ.100 కోట్ల ప్రాజెక్ట్, విజయ్ కనకమెడలతో రూ.60 కోట్ల సినిమా పట్టాలెక్కనున్నాయి. వీటితో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న రెండు భాగాల చిత్రానికి రూ.250 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.