TG: హైదరాబాద్ కేంద్రంగా రూ.7 వేల కోట్ల భూ స్కాం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల భూములకు రక్షణలేదన్నారు. ప్రభుత్వ పెద్దలే గద్దలా తన్నుకు పోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ ఈ భూములను కాపాడితే ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ధ్వజమెత్తారు. ఈ భూములు అమ్ముకోవడానికి వీల్లేదని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.